ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ/ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 75
వివరాలు:
1. ఆఫీసర్ (ఫైనాన్స్) ఈ-1 గ్రేడ్: 10
2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (బాయిలర్): 05
3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 03
4. మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్): 11
5. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్): 02
6. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎన్విరాన్మెంట్): 01
7. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 03
8. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 03
9. మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్): 05
10. మేనేజ్‌మెంట్ ట్రైనీ (సేఫ్టీ): 01
11. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెటీరియల్): 19
12. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్): 01
13. ఆఫీసర్ (సెక్రటేరియల్)ఈ1/ఈ2 గ్రేడ్: 08
14. మేనేజ్‌మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్సెస్): 01
15. మేనేజ్‌మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్): 02
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి సంబంధిత విభాగాలు/ స్పెషలైజేషన్స్‌లో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ఆఫీసర్స్ ఈ1 గ్రేడ్ పోస్టులకు 34 ఏళ్లు; ఆఫీసర్ ఈ1/ ఈ2 గ్రేడ్ పోస్టులకు 40ఏళ్లు; మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.(ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది).
జీతం/ స్టైపెండ్: నెలకు మేనేజ్‌మెంట్ ట్రైనీలకు మొదటి ఏడాది శిక్షణ సమయంలో రూ.60,000; ఆఫీసర్ ఈ1 గ్రేడ్‌కు రూ.40,000- రూ.1,40,000, ఆఫీసర్ ఈ2 గ్రేడ్‌కు రూ.50,000- రూ.1,60,000.
దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు: భోపాల్, న్యూదిల్లీ, లఖ్‌నవూ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గువాహతి, కోల్‌కతా, నవీ ముంబయి/ థాణే/ఎంఎంఆర్ రీజియన్, నాగ్‌పుర్.
పని ప్రదేశం: దేశంలోని ఏదైనా ఆర్‌సీఎఫ్ యూనిట్/ప్రాజెక్ట్‌లో ఉండవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16-06-2025.
Website:https://www.rcfltd.com/