Published on Sep 1, 2025
Apprenticeship
ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

కేంద్రప్రభుత్వ నవరత్న ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన రాష్ట్రీయ కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, ముంబయి, రాయ్‌గడ్‌ యూనిట్లలో గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌, ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 325

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 115 ఖాళీలు

అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌- 35

సెక్రటేరియల్‌ అసిస్టెంట్- 50

రిక్రూట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (హెచ్‌ఆర్‌)- 30

2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 114 ఖాళీలు

డిప్లొమా కెమికల్- 20

డిప్లొమా సివిల్‌- 14

డిప్లొమా కంప్యూటర్‌- 10

డిప్లొమా ఎలక్ట్రికల్‌- 20

డిప్లొమా ఇన్‌స్ట్రుమెంటేషన్‌- 20

డిప్లొమా మెకానికల్‌- 30

3. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 96 ఖాళీలు

అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్)- 74

బాయిలర్ అటెండెంట్- 02

ఎలక్ట్రీషియన్- 02

హార్టికల్చర్ అసిస్టెంట్ - 04

ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్)- 04

లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్)- 08

మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (పాథాలజీ)- 02

అర్హత: ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ/బీఎస్సీ  ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు టెక్నిషియన్‌ ఒకేషనల్ లేదా ఒకేషనల్‌ సర్టిఫికేట్‌ అభ్యర్థులకు రూ.7,000,  టెక్నిషియన్‌ డిప్లొమా అభ్యర్థులకు రూ.8,000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.9,000.

వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది).

ఎంపిక విధానం: విద్యార్హతలు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. అభ్యర్థులు ఎన్‌ఏపీఎస్‌, ఎన్‌ఏటీ అప్రెంటిస్‌ పోర్టల్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: 12.09.2025.

Website:https://www.rcfltd.com/