భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ అత్యంత వేగవంతమైన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొసాగుతుందని, ఇందుకు బలమైన స్థూల ఆర్థిక మూలాలు చేదోడుగా నిలుస్తాయని 2025, మే 29న విడుదల చేసిన వార్షిక నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది.
నివేదిక ముఖ్యాంశాలు:
అంతర్జాతీయ మార్కెట్ ఊగిసలాటలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరాలో ఇబ్బందులు, పర్యావరణ మార్పులు వంటివి ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరొచ్చు.
వరుసగా రెండు సమీక్షల్లో కీలక రేట్లను తగ్గించినందున, ద్రవ్యోల్బణాన్ని 4% లోపు కట్టడి చేయగలం.
2025, మార్చి 31 నాటికి మొత్తం మీద మిగులు ఏడాది కిందటితో పోలిస్తే 27.37% పెరిగి రూ.2.68 లక్షల కోట్లకు చేరింది.