Published on Mar 20, 2025
Current Affairs
ఆర్‌బీఐ బులెటిన్‌
ఆర్‌బీఐ బులెటిన్‌

గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాసులు భారత్‌లో నివసిస్తున్న తమ వారికి పంపిన డబ్బులతో (రెమిటెన్సెస్‌) పోలిస్తే.. అమెరికా, బ్రిటన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రవాస భారతీయులు తమ ఆత్మీయులకు పంపిన డబ్బే గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) అధికంగా ఉంది. ఈ విషయాన్ని 2025, మార్చి 19న విడుదలైన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బులెటిన్‌ పేర్కొంది. అందులోని విశేషాలు:

విదేశాల్లోని భారతీయులు 2010-11లో 55.6 బిలియన్‌ డాలర్ల మేర నిధులను మనదేశానికి పంపారు. 2023-24 కల్లా ఇది రెట్టింపునకు పైగా పెరిగి 118.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10.32 లక్షల కోట్ల)కు చేరింది. విదేశీ అనిశ్చితులను తట్టుకోవడానికి ఈ నిధులు కీలకంగా మారాయి. వస్తువుల ఎగుమతి, దిగుమతి వాణిజ్య లోటులో సగాన్ని ఇవి తీర్చాయి.