గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రాష్ట్రాల ఆదాయ వ్యయాలు, అప్పులు, జీడీపీ వివరాలతో రిజర్వు బ్యాంకు 2025, ఆగస్టు 29న ఒక నివేదికను విడుదల చేసింది.
ఇందులో రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను వివరించింది. దీని ప్రకారం..
దేశంలో తలసరి జీడీపీలో కర్ణాటక రూ.3,80,906తో అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణ రూ.3,79,751తో తర్వాతి స్థానంలో నిలిచింది.
ఏపీలో ఇది రూ.2,66,240గా నమోదైంది.
జాతీయ తలసరి జీడీపీ రూ.2,05,324 మాత్రమే.