రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా 2025, ఏప్రిల్ 2న నియమితులయ్యారు.
ప్రస్తుతం ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా మూడేళ్ల పాటు గుప్తా పనిచేయనున్నారు. జనవరిలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎండీ పాత్రా వైదొలిగిన తర్వాత నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది.
ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మండలిలో సభ్యురాలిగా కూడా గుప్తా ఉన్నారు.