రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా 2024, డిసెంబరు 11న బాధ్యతలు స్వీకరించారు.
డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్, ఎం. రాజేశ్వర్ రావు, టి.రవి శంకర్ సమక్షంలో మల్హోత్రా బాధ్యతల స్వీకారం నిమిత్తం పత్రాలపై సంతకాలు చేశారు. సంజయ్ ఇప్పటిదాకా రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు.