రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా (56)ను కేంద్ర ప్రభుత్వం 2024, డిసెంబరు 9న నియమించింది.
మంత్రివర్గ నియామకాల సంఘం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. మూడేళ్ల పాటు సంజయ్ ఈ పదవిలో కొనసాగుతారు.
సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆర్థిక శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా పనిచేస్తున్నారు.