Published on Dec 13, 2025
Current Affairs
ఆర్‌బీఐ గణాంకాలు
ఆర్‌బీఐ గణాంకాలు
  • దేశవ్యాప్తంగా పండ్ల ఉత్పత్తిలో మొదటిస్థానంలో, పండ్లతోటల సాగులో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో నిలిచినట్లు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1.93 కోట్ల టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత మహారాష్ట్ర 1.68 కోట్ల టన్నుల ఉత్పత్తితో రెండోస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తితో మూడోస్థానంలో ఉంది.
  • 8.07లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగు చేస్తూ దేశంలో రెండోస్థానంలో ఏపీ ఉండగా 8.96 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది.