దేశంలో 2,664 మంది పారిశ్రామిక/ వాణిజ్య వేత్తలు ఉద్దేశ పూర్వకంగా బ్యాంకులకు రూ.1,96,441 కోట్లు ఎగవేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది.
2024, మార్చి ఆఖరు నాటికి ఇంతమొత్తం ఎగవేసినట్లు తెలిపింది.
వ్యక్తులతో పాటు విదేశీ రుణ గ్రహీతలను మినహాయించి, ‘ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలు ఎగవేసిన తొలి 100 మంది కార్పొరేట్ల’ పేర్లను ఆర్‌బీఐ తెలిపింది.
2020 మార్చి ఆఖరుకు 2,154 మంది రూ.1,52,860 కోట్లను బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా ఎగవేయగా, గత 4 ఏళ్లలో ఇది మరింత పెరిగినట్లు ఆర్‌బీఐ గణాంకాలతో స్పష్టమైంది.