మనదేశ ఆర్థిక వృద్ధి గణాంకాలను పరిశీలిస్తే, ఆర్థిక సర్వేలో ప్రకటించిన అంచనాలను తరచుగా అధిగమిస్తున్నాయి. బడ్జెట్ ముందస్తు పత్రం (ప్రీ-బడ్జెట్ డాక్యుమెంట్)లో అంచనా వేసిన 6.3-6.8% వృద్ధికి మించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధిరేటు నమోదవుతుందని అంచనా. 2023-24 ఆర్థిక సర్వేలో జీడీపీ వృద్ధి 6-6.8 శాతమని అంచనా వేయగా, అది 9.2 శాతంగా నమోదైంది.
2024-25లో మాత్రం ఆర్థిక సర్వే అంచనా 6.5-7 శాతానికి అనుగుణంగా, 6.5 శాతంగా నమోదైంది. 2022-23లో లక్ష్యం నెరవేరలేదు. వాస్తవిక ఆర్థిక వృద్ధి 7.65% ఉండగా, ఆర్థిక సర్వే అంచనా 8-8.5 శాతంగా ఉంది. 2021-22లో కొవిడ్ కారణంగా ఆర్థిక సర్వే ఎలాంటి అంచనాలను వేయలేదు. కానీ బేస్ ప్రభావం కారణంగా 9.7% వృద్ధి నమోదైంది.