Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 9, 2026
Current Affairs
ఆర్థిక సంఘం నివేదిక
ఆర్థిక సంఘం నివేదిక
  • గత 11 ఏళ్లలో రెండు ఆర్థిక సంఘాలు చేసిన సిఫార్సులు తారుమారైనట్లు ఆర్థిక సంఘం నివేదికలోని అంశాల విశ్లేషణ ఆధారంగా వెల్లడైంది. పన్నులు, గ్రాంట్ల రూపంలో 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల కంటే వాస్తవంగా రాష్ట్రాల ఖజానాలకు చేరిన మొత్తం దాదాపు 20% తగ్గగా, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కంటే రాష్ట్రాలకు వచ్చిన వాస్తవ మొత్తం 23% పెరిగింది. గత రెండు ఆర్థిక సంఘాల కాలంలో అవి సిఫార్సు చేసిన పన్నులు, గ్రాంట్ల మొత్తంకన్నా రాష్ట్రాలకు 0.42% మొత్తం అధికంగా వచ్చింది. గత 11 ఏళ్లలో పన్నుల రూపంలో రూ.90,28,122 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.17,71,438 కోట్లు కలిపి రూ.1,07,99,562 కోట్లను రాష్ట్రాలకు బదిలీ చేయాలని అవి సిఫార్సు చేశాయి.
  • వాస్తవంగా పన్నుల రూపంలో రూ.93,82,951 కోట్లు (+3.93%), గ్రాంట్ల రూపంలో రూ.14,62,475 కోట్లు (-17,44%) వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం కాలంలో పన్నుల్లో వాటాలో 21.05%, గ్రాంట్లలో 8.85% మేర కోతపడింది. 15వ ఆర్థిక సంఘం ఒక్క 2020-21 సంవత్సర కాలానికి విడిగా చేసిన సిఫార్సుల్లో పన్నుల్లో 30.39%, గ్రాంట్లలో 8.43% మేర ఆదాయం తగ్గింది. అదే ఆర్థిక సంఘం 2021-26 మధ్యకాలానికి చేసిన సిఫార్సుల్లో పన్నుల వాటా 34.23% పెరగ్గా, గ్రాంట్లు 23.66% తగ్గాయి.