నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) బీవీఆర్ సుబ్రమణ్యం పదవీ కాలాల్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది.
1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన 2023 ఫిబ్రవరిలో రెండేళ్ల కాలానికి నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు.
పదవీ కాలం ముగుస్తుండటంతో తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ నియామకాల కమిటీ 2025, ఫిబ్రవరి 20న మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ పదవీ కాలాన్ని కేంద్రం రెండేళ్లు పొడిగించింది. 2022 జనవరి 28న తొలుత ఆయన సీఈఏగా నియమితులయ్యారు.