Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 12, 2026
Current Affairs
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు ఏడోస్థానం
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు ఏడోస్థానం
  • నీతి ఆయోగ్‌ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఖర్చుల నాణ్యత, ఆదాయ సమీకరణ సామర్థ్యం, ఆర్థిక క్రమశిక్షణ, అప్పులు, వడ్డీ చెల్లింపుల్లో వృద్ధి ఆధారంగా 18 రాష్ట్రాలకు ఈ ర్యాంకులు కేటాయించగా.. ఒడిశా, గోవా, ఝార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల తర్వాత స్థానంలో నిలిచింది.  
  • 2023-24లో తెలంగాణలో అభివృద్ధి వ్యయం పురోగమనంలో ఉంది. సామాజిక, ఆర్థిక సేవలకు కేటాయింపులు పెంచారు. మౌలిక వసతుల కల్పన, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రం నుంచి గ్రాంట్లు తగ్గుతూ వచ్చినా.. సొంతంగా పన్ను, పన్నేతర ఆదాయం విస్తరించింది.