Published on Mar 17, 2025
Government Jobs
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, మెదక్‌లో పోస్టులు
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, మెదక్‌లో పోస్టులు

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌ (ఓఎఫ్‌ఎంకే) ఒప్పంద ప్రాతిపదికన ఇంజినీర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07

వివరాలు: 

1. అనాలిసిస్‌ ఇంజినీర్‌: 01

2. డిజైన్‌ ఇంజినీర్‌(మెకానికల్): 04

3. డిజైన్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్): 01

4. డిజైన్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 15-03-2025 తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు అనాలిసిస్‌ ఇంజినీర్‌కు రూ.60,000, డిజైన్‌ ఇంజినీర్‌కు రూ.50,000, డిజైన్‌ అసిస్టెంట్‌కు రూ.40,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు పంపవలసిన చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్‌/హెచ్‌ ఆర్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ-502205.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 04-04-2025.

Website:https://avnl.co.in/careers-vacancies