Published on Apr 13, 2025
Government Jobs
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌లో టెక్నీషియన్‌ పోస్టులు
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌ (ఓఎఫ్‌ఎంకే) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ టెక్నీషియన్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. 

మెత్తం పోస్టుల సంఖ్య: 20

వివరాలు:

1. జూనియర్ టెక్నీషియన్‌(ఎగ్జామినర్‌ ఇంజినీరింగ్‌): 10

2. జూనియర్‌ టెక్నీషియన్‌( ఫిట్టర్‌ జనరల్‌): 10

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎన్‌ఏసీ/ఎన్‌టీసీ(ఫిట్టర్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 - 30 ఏళ్లు.

జీతం: నెలకు రూ.21,000.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌సర్వీస్‌ మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ట్రేడ్‌ టెస్టు ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు పంపవలసిన చిరునామా: యూనిట్‌ ఆఫ్ ఏవీఎన్‌ఎల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌, ఎద్దుమైలారం, సంగారెడ్డి, హైదరాబాద్‌-502205.

దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 14.

Website: https://avnl.co.in/careers-vacancies