రక్షణ శాఖ పరిధిలోని ఆర్మ్‌ర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్)కు చెందిన ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఓఎఫ్ఎంకే) ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 86
వివరాలు:
1. జూనియర్ మేనేజర్: 50
2. డిప్లొమా టెక్నీషియన్: 21
3. అసిస్టెంట్: 11
4. జూనియర్ అసిస్టెంట్: 04
విభాగాలు: మెకానికల్, ప్రొడక్షన్, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రికల్, మెటలర్జీ, టూల్ డిజైన్, డిజైన్, క్వాలిటీ అండ్ ఇన్‌స్పెక్షన్, హెచ్ఆర్, స్టోర్స్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఏ/బీఎస్సీ/ బీకామ్) బీఈ/ బీటెక్, పీజీ (ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకామ్/ ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు జూనియర్ మేనేజర్ పోస్టులకు రూ.30,000; డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు రూ.23,000; అసిస్టెంట్ పోస్టులకు రూ.23,000; జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,000.
వయోపరిమితి: 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ / మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-11-2024.
Website:https://avnl.co.in/