హైదారాబాద్, సంగారెడ్డి ఎద్దుమైలారంలోని ఆర్మ్‌డ్ వెహికిల్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఓఎఫ్‌ఎంకే) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
1. సీనియర్ మేనేజర్: 01
2. జూనియర్ మేనేజర్: 16
విభాగాలు: ఆర్మౌర్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, ఎలక్ట్రకల్, మెటలార్జీ, సీఏడీ స్పెషలిస్ట్, మెకానికల్, మెకానికల్)
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: సీనియర్ మేనేజర్‌కు 45 ఏళ్లు; జూనియర్ మేనేజర్‌కు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ మేనేజర్‌కు రూ.70,000, జూనియర్ మేనేజర్‌కు రూ.30,000.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా ది డిప్యూటీ జనరల్ మేనేజర్/హెచ్‌ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 28.11.2025.
Website:https://ddpdoo.gov.in/career