తెలంగాణ రాష్ట్రంలోని బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ (B.Tech) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
వివరాలు:
బాసర క్యాంపస్: కెమికల్, సివిల్, సి.ఎస్.ఈ (CSE), ట్రిపుల్‌ఈ (EEE), ఈ.సి.ఈ (ECE), మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్, మెకానికల్, మెకానికల్ ఇంజినీరింగ్
మహబూబ్‌నగర్ క్యాంపస్: కంప్యూటర్ సైన్స్ (CSE), CSE-డేటా సైన్స్, CSE-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ (AI & ML).
అర్హతలు: అభ్యర్థులు 2026 సంవత్సరంలో మొదటి ప్రయత్నంలోనే పదవ తరగతి (SSC) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు (జిల్లా పరిషత్, మున్సిపల్)లో చదివిన విద్యార్థులకు అదనంగా 4 మార్కుల డిప్రైవేషన్ స్కోరు (Deprivation Score) వెయిటేజీగా పొందవచ్చు.
వయోపరిమితి: 01.06.2026 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు (పీహెచ్/క్యాప్/ఎన్‌సీసీ/క్రీడాకారులు) మాత్రమే తమ దరఖాస్తు కాపీలను సంబంధిత సర్టిఫికేట్లతో కలిపి పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ రూ.500; ఎస్సీ/ఎస్టీ- రూ.450; ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1,500; భర్తీ కాని గ్లోబల్ సీట్లపై ఆసక్తి ఉన్న తెలంగాణ అభ్యర్థులు రూ.1,500.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభం: 18-03-2026.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2026.
ప్రత్యేక కేటగిరీ దరఖాస్తుల స్వీకరణ (పోస్ట్ ద్వారా): 20-05-2026.
ఎంపికైన వారి జాబితా ప్రకటన: 30-05-2026 (తాత్కాలికం).
మొదటి దశ కౌన్సిలింగ్: 05.06.2026.
Website:https://www.rgukt.ac.in/