Published on Nov 25, 2025
Walkins
ఆర్‌జీఎన్‌ఐవైడీలో లైబ్రరీ కమ్‌ డాక్యుమెంటేషన్‌ ఆఫీసర్‌ పోస్టులు
ఆర్‌జీఎన్‌ఐవైడీలో లైబ్రరీ కమ్‌ డాక్యుమెంటేషన్‌ ఆఫీసర్‌ పోస్టులు

తమిళనాడు, పెరుంబుదూర్‌లోని రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ డెవెలప్‌మెంట్‌ (ఆర్‌జీఎన్‌ఐవైడీ) రెగ్యులర్‌, ఒప్పంద, డిప్యూటెషన్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

1. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌- 01

2. ఫైనాన్స్‌ ఆఫీసర్‌- 01

3. లైబ్రరీ కమ్‌ డాక్యుమెంటేషన్‌ ఆఫీసర్‌- 01

4. అసిస్టెంట్‌- 01

5. కన్సల్టెంట్‌ (అడ్మినిస్ట్రేషన్‌, అకాడమిక్స్‌): 02

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, తదితర నైపుణ్యాలు ఉండాలి.

వయోపరిమితి: కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌కు 55 ఏళ్లు; ఫైనాన్స్‌ ఆఫీసర్‌కు 57 ఏళ్లు; లైబ్రరీ కమ్‌ డాక్యుమెంటేషన్‌ ఆఫీసర్‌కు 30ఏళ్లు; అసిస్టెంట్‌కు 27 ఏళ్లు; కన్సల్టెంట్‌కు 62 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది అసిస్టెంట్‌ రిజిస్ట్రర్‌, రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ డెవెలప్‌మెంట్‌, బెంగళూరు-చెన్నై హైవే, శ్రీపెరుంబుదూర్‌, తమిళనాడు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 22.12.2025.

Website:https://www.rgniyd.gov.in/?q=content/recruitment-notification-teaching-non-teaching-positions