అమేథీ (ఉత్తర్ ప్రదేశ్)లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (ఆర్‌జీఎన్‌ఏయూ) 2025-26 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలు 2025-26
విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అండ్ ఏవియేషన్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-ఏవియానిక్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్, ఏవియేషన్ మేనేజ్‌మెంట్.
మొత్తం సీట్ల సంఖ్య: 25
అర్హత: విభాగాలను అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55% మార్కులతో ఏదైనా ఎంటెక్/ ఎంఎస్ (రిసెర్చ్), మాస్టర్స్ డిగ్రీతో పాటు గేట్ స్కోర్ లేదా సంబంధిత విభాగంలో 75 శాతం మార్కులతో బీఈ/బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500; మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30-11-2025.