దేశ అణు పరీక్షల్లో కీలక భూమిక పోషించిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం (88) 2024, జనవరి 4న ముంబయిలోని జస్‌లోక్ ఆసుపత్రిలో మరణించారు.
దేశం రెండుసార్లు నిర్వహించిన అణు పరీక్షల్లో ఆయనది ముఖ్యపాత్ర. అణు ఇంధన కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించడంతో పాటు వ్యూహాత్మక ఆయుధాల అభివృద్ధిలో విశేష సేవలందించారు.
చెన్నైలో జన్మించిన ఆయన 1990లో భాభా అణు పరిశోధన కేంద్రం (బార్క్) డైరెక్టర్ అయ్యారు. 1974లో పోఖ్రాన్-1, 1998లో పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలక సేవలందించారు.
అణ్వాయుధాల రూపకల్పనలో దేశానికి ఆయన చేసిన సేవలకు కేంద్రం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసింది.