దేశంలో 2024-25లో మొత్తం ఆరోగ్య బీమా ప్రీమియం విలువ రూ.1.2 లక్షల కోట్లను అధిగమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2023-24 ప్రీమియం కంటే ఇది 9% అధికం. వైద్య ఖర్చులు అధికమవుతుండటంతో, బీమా తీసుకోవడానికి అధికులు ముందుకు వస్తున్నారని ఆర్థిక శాఖ తెలిపింది. పాలసీదారులకు సకాలంలో మద్దతు అందేలా చూసేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ).. నగదు రహిత ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ కోసం, కంపెనీలకు నిర్దిష్ట కాల పరిమితులను నిర్దేశించింది.
నగదు రహిత ప్రీ-ఆథరైజేషన్‌ను ఒక గంటలోగా, తుది ఆథరైజేషన్‌ను మూడు గంటల్లోగా ఆమోదించాలి. పాలసీదారుల వయసు పెరగడం, అధిక కవరేజీ, మెరుగైన సదుపాయాల వల్ల ఆరోగ్య బీమా ప్రీమియం పెరుగుతోందని వివరించింది.