భారత సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ కులకర్ణికి బ్రిటిష్ రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ (ఆర్‌ఏఎస్) స్వర్ణ పతకాన్ని ప్రదానం చేసింది. ఆర్‌ఏఎస్ 1824 నుంచి ఏటా బహూకరిస్తున్న స్వర్ణ పతకాలను పొందినవారిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఎడ్విన్ హబుల్, స్టీఫెన్ హాకింగ్ లాంటి జగద్విఖ్యాత శాస్త్రవేత్తలు ఉన్నారు.
కులకర్ణి మహారాష్ట్రలో జన్మించారు. ఐఐటీ-దిల్లీలో చదువుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా-బెర్కిలీ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. 40 ఏళ్ల నుంచి కాల్టెక్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, పరిశోధకుడిగా ఉన్నారు.
విశ్వ రహస్యాలను ఛేదించడానికి తోడ్పడే 10 పరికరాలను కూడా రూపొందించారు.