బ్రిటన్‌కు చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత వాయుసేన (ఐఏఎఫ్) తొలిసారి సిద్ధమైంది. దిల్లీ వేదికగా 2026, ఫిబ్రవరి 12న జరిగిన 19వ బ్రిటన్-భారత్ వైమానిక సిబ్బంది చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్ వ్యాలీలో ముగ్గురు క్వాలిఫైడ్ ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్లను ఐఏఎఫ్ ప్రాథమికంగా రెండేళ్ల పాటు విధుల్లో ఉంచనుంది.