హరియాణా, గురుగ్రామ్‌లోని ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెంట్ లిమిటెడ్ (ఆర్ఈసీపీడీసీఎల్) ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
వివరాలు:
1. సీనియర్ ఎగ్జిక్యూటివ్: 01
2. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 10
3. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 04
4. ఎగ్జిక్యూటివ్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో సీఏ/సీఎంఏ, డిగ్రీ (లా), బీఈ/బీటెక్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఐటీ), ఎంబీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 48 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.1,35,000; ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.1,12,000; డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.85,000; అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.62,000.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28-11-2024.
Website:https://www.recpdcl.in/