Published on Nov 15, 2025
Government Jobs
ఆర్‌ఆర్‌యూలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఆర్‌ఆర్‌యూలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్  ఉద్యోగాలు

గుజరాత్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ)  ఒప్పంద ప్రాతిపదికన  వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 09

వివరాలు:

1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01

2. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కమ్ కో-ఆర్డినేటర్ - 01

3. అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్  - 01

4. గ్రాఫిక్ డిజైనర్ - 01

5. రిసెర్చ్ ఆఫీసర్ - 01

6. మెడికల్ అసిస్టెంట్ - 01

7. లీగల్ ఆఫీసర్ - 01

8. టీచింగ్ కమ్ రిసెర్చ్ ఆఫీసర్ - 01

9. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  కనీసం 55 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, పీజీ(పారామెడికల్ సైన్సెస్‌, నర్సింగ్, గ్రాఫిక్ డిజైన్/ప్రొడక్ట్ డిజైన్/అప్లైడ్ ఆర్ట్స్/మల్టీమీడియా ఆర్ట్స్ )లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు రూ.55,000 - రూ.65,000.  అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కమ్ కో-ఆర్డినేటర్ కు రూ.40,000. - రూ.50,000. అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్ కి రూ.30,000.- రూ.50,000. గ్రాఫిక్ డిజైనర్ కు రూ.55,000. - రూ.65,000. రిసెర్చ్ ఆఫీసర్ కు రూ.55,000.- రూ.70,000. మెడికల్ అసిస్టెంట్ కు రూ.35,000. - రూ. 45,000. లీగల్ ఆఫీసర్ కు రూ.50,000. - రూ.60,000. టీచింగ్ కమ్ రిసెర్చ్ ఆఫీసర్ కు రూ. 60,000. - రూ.75,000. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ కు రూ. 70, 000 - రూ. 1,15,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025, నవంబరు 20.

Website:https://rru.ac.in/career/