ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీల) నాలుగో దశ విలీన ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఆర్‌ఆర్‌బీలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు, ఖర్చుల నియంత్రణ కోసం వీటిని విలీనం చేయాలని నాబార్డ్, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చల అనంతరం కేంద్రం నిర్ణయించింది.
ప్రస్తుతం 43 ఆర్‌ఆర్‌బీలు ఉండగా, వివిధ రాష్ట్రాల్లోని 15 ఆర్‌ఆర్‌బీలు విలీనం కానున్నాయి. ఫలితంగా మొత్తం ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కి తగ్గనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని 4, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో 3 చొప్పున, బిహార్, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లో రెండేసి చొప్పున ఆర్‌ఆర్‌బీలు విలీనం కానున్నాయి.