Published on Sep 24, 2024
Current Affairs
ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన
ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన

ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 2024 సెప్టెంబరు 1 నాటికి 7.79 కోట్ల మందికి రూ.1.07 లక్షల కోట్ల విలువైన వైద్యచికిత్సలు అందించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఈ పథకం కింద లబ్ధిపొందినవారిలో 3.61 కోట్ల మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. 

ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మొదీ 2018, సెప్టెంబరు 23న ప్రారంభించారు.

అత్యధిక వైద్యసేవలు పొందిన విభాగాలు

కాటరాక్ట్‌ సర్జరీలు    22,43,765

రొమ్ము కేన్సర్‌    5,61,350

కరోనరీ యాంజియోప్లాస్టీ    4,71,519

మూత్రనాళంలో రాళ్ల తొలగింపు    3,77,904

హైరిస్క్‌ కాన్పులు    1,69,196

ఊపిరితిత్తుల క్యాన్సర్‌    1,60,089

మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు    1,54,538

అపెండిక్స్‌ తొలగింపు    1,40,638

తుంటి మార్పిడి సర్జరీలు    72,345

తల శస్త్రచికిత్సలు    66,219

బైపాస్‌ సర్జరీలు    60,221

హార్ట్‌ వాల్వ్‌ సర్జరీలు    31,462

నోటి క్యాన్సర్‌    24,645

గాల్‌బ్లాడర్‌ తొలగింపు సర్జరీలు    18,168

గ్రహణంమొర్రి సర్జరీలు    2,281