కార్గిల్‌లో పాకిస్థాన్ చొరబాటుదారులను తరిమికొట్టడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్ వార్షికోత్సవం సందర్భంగా 2025, మే 26న వైమానిక దళం ఓ వీడియోను విడుదల చేసింది. 26 ఏళ్ల క్రితం నిర్వహించిన ఈ ఆపరేషన్‌ను వాయుసేన చరిత్రలో గొప్ప మైలురాయిగా అభివర్ణించింది. భారత్-పాకిస్థాన్ మధ్య 1999 మే 3 నుంచి జులై 26 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. నాడు భారత సైన్యానికి మద్దతుగా 1999 మే 26న భారత వాయుసేన రంగంలోకి దిగింది. 47 రోజుల పాటు ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ను చేపట్టి కార్గిల్ నుంచి పాకిస్థాన్ సైనికులను, ఉగ్రవాదులను వాయుసేన తరిమి కొట్టింది.