పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తయ్యిబా ఉగ్రస్థావరాలపై భారత సైన్యం 2025 మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో దాడులు నిర్వహించింది.
పాక్, పీఓకేలోని మొత్తం 9 ఉగ్రస్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది.
ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీతో పాటు ఆర్మీ సిగ్నల్ కోర్‌కు చెందిన కల్నర్ సోఫియా ఖురేషీ, వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు తెలిపారు.
చరిత్రలో మొదటిసారిగా సైనిక ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులు వెల్లడించారు.