దిత్వా తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీలంకకు మానవతా సాయం అందించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సాగర్ బంధు’ను ప్రారంభించింది. కష్టసమయంలో పొరుగుదేశానికి చేయూత అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
తుపాను కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతోపాటు కొండచరియలు విరిగిపడడంతో మరణించినవారి సంఖ్య 80కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది.