Published on Sep 15, 2025
Current Affairs
ఆపరేషన్‌ ‘భాస్కర్‌’
ఆపరేషన్‌ ‘భాస్కర్‌’

విమానాశ్రయాల్లో విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించేందుకు దేశంలోని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఆపరేషన్‌ ‘భాస్కర్‌’ పేరుతో సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 100% సౌర విద్యుత్‌ను వినియోగిస్తున్న తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా కోచి విమానాశ్రయం పేరొందింది.

ఈ తరహాలో మిగిలిన ఎయిర్‌పోర్ట్‌లలో సౌర విద్యుత్‌ వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు.

దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి విమానాశ్రయాల్లో హరిత ఇంధనాన్ని వినియోగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

వచ్చే అయిదేళ్లలో దేశంలోని 44 విమానాశ్రయాల్లో 15% సోలార్‌ విద్యుత్‌ ఉండేలా ప్రణాళిక రచించారు.

కోచి అంతర్జాతీయ విమానాశ్రయం సంప్రదాయ విద్యుత్‌ను వినియోగించడం లేదు.

పదేళ్ల క్రితం సౌర విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా కొంత ఇంధనాన్ని అధికారులు ఉత్పత్తి చేశారు.

ఏటా సామర్థ్యాన్ని పెంచుతూ 2025 ప్రథమార్థానికి పూర్తిగా సోలార్‌ పవర్‌తోనే విమానాశ్రయంలోని ప్రతి విభాగాన్ని నడిపిస్తున్నారు.