అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్‌బీయింగ్ రిసెర్చ్ సెంటర్ ఆనందమయ దేశాల జాబితా (వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్) 2025ను మార్చి 20న విడుదల చేసింది.
ఫిన్లాండ్ వరుసగా 8వ సారి ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. 2024లో 126వ స్థానంలో ఉన్న భారత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ప్రస్తుతం 118వ ర్యాంకు సాధించింది.
నేపాల్ (92), చైనా (68), పాకిస్థాన్ (109) దేశాలు ఈ విషయంలో మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. శ్రీలంక (133), బంగ్లాదేశ్ (134) వెనుకబడి ఉన్నాయి.
అఫ్గానిస్థాన్ మరోసారి జాబితాలో ఆఖరి (147) స్థానంలో నిలిచింది.