- ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పొడవు ఇప్పుడు 1,053.07 కిలోమీటర్లకు చేరిందని కేంద్ర భూవిజ్ఞానం, శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ ఇదివరకున్న 973.7 కిలోమీటర్లను సవరించి ఇప్పుడు 1,053.07 కిలోమీటర్లుగా నిర్ధారించినట్లు చెప్పారు. ఆయన 2025, డిసెంబరు 4న రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు.
- నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ (ఎన్‌ఎస్‌సీఎస్) ప్రతిపాదించిన తాజా విధివిధానాలను అనుసరించి సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మదింపుచేసి భారత తీరప్రాంతాన్ని ఇదివరకున్న 7,516.6 కిలోమీటర్ల నుంచి 11,098.81 కిలోమీటర్లుగా ఖరారుచేసినట్లు చెప్పారు.