ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి డైరెక్ట్, ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ (గౌరవ న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లకు) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ: మొత్తం పోస్టులు 32.
(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్: 20 పోస్టులు, బదిలీ ద్వారా 12 పోస్టులు)
అర్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లా డిగ్రీ (3 ఏళ్లు లేదా 5 ఏళ్లు) పూర్తి చేసి ఉండాలి. నిమిషానికి 180 పదాల వేగంతో ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ (లేదా 150 డబ్ల్యూపీఎం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు), నిమిషానికి 45 పదాల వేగంతో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.57,100 నుంచి రూ. 1,47,760.
ఎంపిక విధానం: అభ్యర్థులకు 100 మార్కులకు రాత పరీక్ష (Shorthand Dictation & Transcription) నిర్వహిస్తారు. ఇందులో 180 w.p.m (3 నిమిషాల వ్యవధి), 150 w.p.m (4 నిమిషాల వ్యవధి) వేగంతో డిక్టేషన్ ఇచ్చి, వాటిని కంప్యూటర్లలో ట్రాన్స్‌క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఓసీ/ఈడబ్ల్యూఎస్/బీసీలకు రూ.600; ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చిరునామాకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.04.2026.
ముఖ్యాంశాలు:
దరఖాస్తుతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్ కాపీలు తప్పనిసరిగా ఉండాలి
రిజర్వేషన్ చేసుకునే వారు సంబంధిత తాజా కుల/ఆదాయ ధ్రువపత్రాలను సమర్పించాలి.
Website:http://https//aphc.gov.in/