ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా డా. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్- (టెక్నికల్): 48 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం, టైపింగ్ నైపుణ్యం తప్పనిసరి.
వయోపరిమితి: 60 సంవత్సరాల మించకూడదు.
జీతం: నెలకు రూ.55,350.
ఎంపిక విధానం: విద్యార్హతలు, సర్వీస్ వెయిటేజ్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000; బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.750.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.09.2025
Website:https://apmsrb.ap.gov.in/msrb/