ఇంధన సంరక్షణలో మంచి పనితీరు కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు-2025 గ్రూప్-2 విభాగంలో మొదటి బహుమతి లభించింది. 2025, డిసెంబరు 14న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఈ అవార్డు స్వీకరించారు. అలాగే 53,132 యూనిట్ల విద్యుత్తు పొదుపు చేసినందుకు దక్షిణమధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ ప్రభుత్వ భవనాల విభాగంలో జాతీయస్థాయి పురస్కారాన్ని సొంతం చేసుకుంది. దాని తరఫున దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.