Published on Oct 25, 2024
Walkins
ఆదిలాబాద్ రిమ్స్‌లో టీచింగ్ పోస్టులు
ఆదిలాబాద్ రిమ్స్‌లో టీచింగ్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

వివరాలు:

1. ప్రొఫెసర్

2. అసోసియేట్ ప్రొఫెసర్

3. అసిస్టెంట్ ప్రొఫెసర్

4. ట్యూటర్‌

5. సీఎంవో 

6. సివిల్ అసిస్టెంట్ సర్జన్

విభాగాలు: అనాటమీ, ఆప్తాల్మాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్థీషియా, సైకియాట్రీ తదితరాలు.

అర్హత: ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.

వయసు: 64 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు ప్రొఫెసర్- రూ.190000, అసోసియేట్ ప్రొఫెసర్- రూ.150000, అసిస్టెంట్ ప్రొఫెసర్- రూ.125000, సీఏఎస్- రూ.52000, సీఎంఓ- రూ.52000, సీఏఎస్- రూ.55000.

ఇంటర్వ్యూ తేది: 29.10.2024.

వేదిక: ఆఫీస్‌ ఆఫ్‌ ది డైరెక్టర్‌, రిమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఆదిలాబాద్.

Website:https://adilabad.telangana.gov.in/