Published on Aug 23, 2025
Current Affairs
ఆదాయపు పన్ను చట్టం-2025ను ఆమోదించిన రాష్ట్రపతి
ఆదాయపు పన్ను చట్టం-2025ను ఆమోదించిన రాష్ట్రపతి

ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, ఆగస్టు 22న ఆమోదం తెలిపారు.

దీంతో ఆదాయపు పన్ను చట్టం-1961ని ఇది భర్తీ చేయనుంది.

ఆదాయపు పన్ను చట్టం-2025.. 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.

ఇది పన్ను చట్టాలను మరింత సులభతరం చేయనుంది. 

ఆదాయపు పన్ను-2025 బిల్లును ఈ నెల 12న పార్లమెంటు ఆమోదించింది.