Published on Jan 12, 2026
Current Affairs
ఆదిత్య-ఎల్‌1
ఆదిత్య-ఎల్‌1
  • శక్తిమంతమైన సౌర తుపాన్ల కారణంగా.. భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రంపై పడే ప్రభావం గురించి  ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం సరికొత్త విషయాలను అందించింది. సౌర తుపానులోని తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ప్రభావం అధికంగా ఉంటున్నట్లు వెల్లడైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది. 
  • ఆదిత్య-ఎల్‌1 అనేది భారత తొలి సౌర పరిశీలక ఉపగ్రహం. 2024 అక్టోబరులో వచ్చిన సౌర తుపానుకు సంబంధించిన డేటాను ఇది అందించింది. దాన్ని, ఇతర అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లు అందించిన వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. సూర్యుడి నుంచి భారీ స్థాయిలో వెలువడిన సౌర ప్లాస్మా ప్రభావాన్ని పరిశీలించారు. సౌర తుపానుకు సంబంధించిన అల్లకల్లోల ప్రాంతం.. పుడమి అయస్కాంత క్షేత్రాన్ని తీవ్రస్థాయిలో సంకోచింపచేస్తున్నట్లు గుర్తించారు.