తూర్పు నావికాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్‌అడ్మిరల్ రాజేష్ పెంథార్కర్ 2025, అక్టోబరు 6న ఐఎన్‌ఎస్ ఆండ్రోత్‌ను విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డు వద్ద ప్రారంభించారు. కోల్‌కతాలోని జీఆర్‌ఎస్‌ఈ సంస్థ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించింది. శత్రుదేశాల జలాంతర్గాములను పసిగట్టి వాటిని నాశనం చేయడం దీని ప్రత్యేకత.