ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 2025, అక్టోబరు 4న విజయవాడలో ప్రారంభించారు. 2.90 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ అయ్యాయి.
ఉబర్, ర్యాపిడో తరహాలో రాష్ట్రంలోని ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.