భారత మహిళల బ్యాడ్మింటన్‌కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా నెహ్వాల్ 2026, జనవరి 19న ఆటకు వీడ్కోలు పలికింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి బ్యాడ్మింటన్‌లో అత్యున్నత శిఖరాలకు చేరింది. గత కొన్నేళ్లుగా సైనా ఆటకు దూరంగానే ఉంది. ఆమె చివరగా 2023లో సింగపూర్ ఓపెన్‌లో ఆడింది. మోకాళ్ల సమస్యే తన వీడ్కోలు నిర్ణయానికి కారణమని ఆమె తెలిపింది.
విశేషాలు:
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్, సూపర్ సిరీస్‌లలో అంతకుముందెప్పుడూ చూడని విజయాలు భారత్ సొంతమయ్యాయంటే సైనానే కారణం.
2009లో అర్జున అవార్డు పొందిన సైనా.. 2010లో అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న సొంతం చేసుకుంది.
ఒలింపిక్స్‌తో పాటు బీడబ్ల్యూఎఫ్ మేజర్ టోర్నీలైన ప్రపంచ ఛాంపియన్‌షిప్, ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కనీసం ఒక పతకం సాధించిన తొలి భారత ప్లేయర్ సైనానే.