2025, ఆగస్టులో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.5 శాతం పెరిగి రూ.1.86 లక్షల కోట్లకు చేరాయి.
2024 ఆగస్టులో రూ.1.75 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి.
2025 జులైలో ఇవి రూ.1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి.
స్థూల దేశీయ ఆదాయం 9.6 శాతం పెరిగి రూ.1.37 లక్షల కోట్లకు చేరగా, దిగుమతుల పన్ను 1.2 శాతం తగ్గి రూ.49,354 కోట్లకు పరిమితమైంది.
జీఎస్‌టీ రిఫండ్‌లు 20 శాతం తగ్గి రూ.19,359 కోట్లకు పరిమితమయ్యాయి.