అమెరికా ప్రభుత్వంలో వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు తేవడమే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీలో (డోజ్) భారత సంతతి కుర్రాడు ఆకాశ్ బొబ్బాకు చోటు దక్కింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో పని చేసే ఈ విభాగంలోకి తీసుకున్న ఆరుగురు యువ ఇంజినీర్లలో అతడూ ఉన్నాడు. ఈ ఆరుగురూ 19 నుంచి 24 ఏళ్ల లోపు వయసు వారే.
ఆకాశ్ బొబ్బా బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు.
మెటా, పలంటీర్ సంస్థల్లో ఇంటర్న్‌గా పని చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లోనూ కొంతకాలం పని చేశాడు.