భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ 2026 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా ద్వారా రైఫిల్‌మ్యాన్ / రైఫిల్ ఉమెన్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం అర్హులైన భారత పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఫిబ్రవరి 2026 నుంచి మే 2026 వరకు నిర్వహిస్తారు.
వివరాలు:
రైఫిల్‌మెన్/ రైఫిల్ ఉమెన్ (జనరల్ డ్యూటీ- స్పోర్ట్స్ కోటా): మొత్తం 95 పోస్టులు
క్రీడ విభాగాలు: ఫుడ్‌బాల్, షూటింగ్, పెన్‌కాక్ సిలాట్, క్రాస్ కరటే, ఆర్చరీ, బాక్సింగ్, సెపక్‌తక్రా, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, రోయింగ్, జూడో, త్వైకాండో, పోలో, వుషూ.
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్రస్థాయి/ఖేలో ఇండియా పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు అయి ఉండాలి. సంబంధిత చెల్లుబాటు అయ్యే క్రీడా సర్టిఫికెట్లు తప్పనిసరి.
వయోపరిమితి: 01.01.2026 నాటికి జనరల్/ఓబీసీలకు 18 నుంచి 28 ఏళ్లు; ఎస్సీ/ఎస్టీలకు 18 నుంచి 33 ఏళ్ల మద్య ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థి ధ్రువీకరణ, డాక్యుమెంట్ వెరిఫికేషణ్, స్పోర్ట్స్ ఫీల్డ్ ట్రయల్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.100; ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభం: 10.01.2026.
దరఖాస్తు చివరి తేదీ: 09.02.2026.
Website:https://assamrifles.gov.in/