భారతదేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తీవ్రరూపం దాల్చుతున్నాయని, తక్కువ సగటు ఆదాయంతో ప్రపంచంలోనే అత్యధిక అసమానతలున్న దేశంగా భారత్ నిలిచిందని ప్రపంచ అసమానతల సూచిక నివేదిక వెల్లడించింది. గత పదేళ్లలో అసమానతలు అధిగమించడంలో ఎలాంటి ప్రగతి లేదని, కార్మిక బలగంలో మహిళల ప్రాధాన్యం పెరగలేదని పేర్కొంది.
దేశంలో టాప్ 10% మంది చేతుల్లో దాదాపు 40.01% సంపద ఉందని తెలిపింది. జాతీయ ఆదాయంలో 58% వీరి వద్ద ఉందని, అట్టడుగు నుంచి 50% మంది వద్ద 15 శాతమే ఉందని వివరించింది. పరిపాలన, విధానాల వైఫల్యాలతో అసమానతలు పెరుగుతున్నాయి. 0.001% మంది మల్టీ మిలియనీర్లు ప్రపంచంలోని 50% మంది కన్నా మూడింతలు అధిక సంపద కలిగి ఉన్నారు. వారు 1995లో 4% ఉంటే.. ఇప్పుడు 6 శాతానికి పెరిగారు.