Published on Jul 12, 2025
Current Affairs
అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

దృశ్య పరిధి అవతలున్న (బియాండ్‌ విజువల్‌ రేంజ్‌) లక్ష్యాలను ఛేదించే ‘అస్త్ర’ క్షిపణిని భారత్‌ 2025, జులై 11న విజయవంతంగా పరీక్షించింది.

ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల ఈ అస్త్రాన్ని సుఖోయ్‌-ఎంకేఐ యుద్ధవిమానం నుంచి ప్రయోగించారు.

ఇది వంద కిలోమీటర్లకు మించిన పరిధి కలిగి ఉంది. ఇందులో అధునాతన గైడెన్స్, నేవిగేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి.

తాజా పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత వాయుసేన నిర్వహించాయి.