కరీంనగర్‌కు చెందిన అర్రోజు అశోక్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ హస్తకళల అవార్డు అందుకున్నారు. సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్‌లో ఆయన చూపిన ప్రతిభకు గాను కేంద్ర జౌళిశాఖ 2024 సంవత్సరానికిగాను ‘డిజైన్ అండ్ ఇన్నోవేషన్’ విభాగంలో ప్రకటించిన అవార్డును రాష్ట్రపతి 2025, డిసెంబరు 9న న్యూదిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అశోక్‌కు ప్రదానం చేశారు.